భవనాన్ని కూల్చేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి

byసూర్య | Thu, Jan 26, 2023, 07:39 PM

పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవనాన్ని కూల్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొనడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి మినిస్టర్ రోడ్ లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన భవనం వద్దకు చేరుకున్నారు. భవనం కూల్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదం చాలా బాధాకరం అన్నారు. ప్రమాదంలో మరణించిన ముగ్గురి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ను ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. ప్రమాద సమయంలో అన్ని శాఖల అధికారులు సకాలంలో తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పరిసర ప్రాంత ప్రజలను మున్నూరు కాపు సంఘ భవనంలోకి తరలించి వసతి, భోజన సౌకర్యాలను కల్పించినట్లు చెప్పారు. మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఎంతో శ్రమించారని అన్నారు. భవనాన్ని కూల్చేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని, గురువారం సాయంత్రం వరకు కూల్చివేతే పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ, తహసీల్దార్ శైలజ, ఈ ఈ సుదర్శన్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్ తదితరులు ఉన్నారు.


Latest News
 

పెరుగుతున్న యాదాద్రి ఆలయ ఆదాయం Wed, Mar 29, 2023, 09:12 PM
వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:57 PM
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన Wed, Mar 29, 2023, 08:44 PM
మోసగాడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు Wed, Mar 29, 2023, 08:43 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ ఆవిర్భావ సభ Wed, Mar 29, 2023, 08:42 PM