అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు కృషి: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jan 26, 2023, 11:25 AM

ఎల్బీనగర్ నియోజకవర్గంలో రోజు రోజుకు కొత్తకాలనీలు పెరుగుతున్నాయని. ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. వసతుల కల్పన దిశగా అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. బుధవారం సాయంత్రం హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాతనాయక్ తో కలిసి అధికారులతో డివిజన్ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి మాట్లాడుతూ. డివిజన్ పరిధిలోని కాలనీలలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆయా ప్రాంతాలలో పర్యటించి నివేదిక సమర్పించాలన్నారు. కాలనీలలో నూతన రోడ్లను, మంచినీటి పైప్ లైన్ల ఏర్పాటు, విద్యుత్ త్రీఫేస్ కరెంట్ అవసరమో గుర్తించి వాటిని తన దృష్టికి తీసు కొస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు మంజూరు అయ్యేలా చర్యలు చేపడతామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అత్తుత్తమ నియోకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్జెల మధుసూదన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆండోజు సత్యంచారి, నాయకులు శ్రీనివాస్ నాయక్, డేరింగుల కృష్ణ, శ్రీనివాసయాదవ్, ఉదయ్ రెడ్డి, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , నాగిరెడ్డి, అధికారులు కోటే శ్వరరావు, కనకయ్య, బలరాంరాజు, శ్రీనివాసులు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM