byసూర్య | Thu, Jan 26, 2023, 11:19 AM
దుద్యాల మండల పరిధిలోని చిల్ముల్ మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ హనుమప్పతోపాటు 50 మంది కార్యకర్తలు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.