కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమా

byసూర్య | Thu, Jan 26, 2023, 10:53 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ ఎమ్మెల్యే వనమా వెంకటెశ్వరరావు స్వగృహంలో బుధవారం లక్ష్మిదేవిపల్లి మండలానికి సంబంధించిన సుమారు రూ. 1, 10, 00, 000. 00 (ఒక కోటి పది లక్షల రూపాయల) విలువ గల 110 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే వనమా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ పేదోళ్ల ఆడపిల్లలకు పెద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలో అమలు కావట్లేదని, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనా, సర్పంచ్ లు అజ్మీరా భారతి, కొరెం చంద్ర శేఖర్, జోగ బక్కయ్య, వర్సా వసంత రావు, కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్లు శేషాద్రి వినోద్, పొగాకు వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి తాసిల్దార్ నాగరాజు, ఆర్. ఐ నరసింహ రావు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM