ఫైర్‌ సేఫ్టీ తనిఖీలు తప్పనిసరి: కేటీఆర్

byసూర్య | Thu, Jan 26, 2023, 10:42 AM

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని భారీ, ఎత్తయిన భవనాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దవాఖానలు, పాఠశాలలు, అపార్ట్‌మెంట్లలో అగ్నిమాపక తనిఖీలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ, అనుమతులపై బుధవారం బీఆర్‌కే భవన్‌లో మంత్రులు, అధికారులతో ఆయన బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఫైర్‌సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని చెప్పారు. మున్సిపల్‌, పోలీస్‌, ఫైర్‌, తదితర శాఖల అధికారులు సమయన్వంతో పనిచేస్తూ. నిర్ణీత కాలంలో తనిఖీలు పూర్తిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా దవాఖానలు, పాఠశాల భవనాలు, పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ గోదాములు, వాణిజ్య భవనాలు, ఎత్తయిన అపార్టుమెంట్లలో తప్పనిసరిగా తనిఖీలు చేపట్టాలని చెప్పారు. గణనీయంగా పెరుగుతున్న నగర జనాభాకు భద్రత కల్పించడమే తమకు అత్యంత ముఖ్యమైన అంశమని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫైర్‌ సేఫ్టీ తనిఖీల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే 1999లో రూపొందించిన ఫైర్‌ సేఫ్టీ చట్టాలను మార్చేందుకు తగిన ప్రతిపాదనలు పంపాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

Latest News
 

పెరుగుతున్న యాదాద్రి ఆలయ ఆదాయం Wed, Mar 29, 2023, 09:12 PM
వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:57 PM
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన Wed, Mar 29, 2023, 08:44 PM
మోసగాడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు Wed, Mar 29, 2023, 08:43 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ ఆవిర్భావ సభ Wed, Mar 29, 2023, 08:42 PM