ఉప్పల్లో సిసి రోడ్డు పనులు: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jan 26, 2023, 10:41 AM

ఉప్పల్ డివిజన్లో రూ. 77లక్షల వ్యయంతో చేపడుతున్న సిసి రోడ్డు పనులను బుధవారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, స్థానిక కార్పో రేటర్ మందముల్ల రజిత పరమేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉప్పల్ మాల్ మైసమ్మ దేవాలయం మార్గంలో సిసి రోడ్డు, ఉప్పల్ బస్టాండ్ వెనుక గాంధీనగర్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో పెండిం గ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, గడ్డం రవికుమార్, వేముల సంతోష్ రెడ్డి, మస్క సుధాకర్, టంటం వీరేష్, కాంగ్రెస్ పార్టీ నేతలు బోరంపేట కృష్ణ, ఈగ పాండు, బాకారం లక్ష్మణ్, ఈ అంజయ్య, పండ్ల బాలయ్య, ఈగ బాబు, మహంకాళి రాజు, శేఖర్రెడ్డి, ఉల్పారాజు, సల్ల ప్రభాకర్ రెడ్డి, గొరిగె జహంగీర్, మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM