byసూర్య | Thu, Jan 26, 2023, 09:58 AM
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం పరిధిలోని గ్రామాల్లో రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా గురువారం స్థానిక ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు దేశ నాయకుల వివిధ వేషాధారణలో ఆకట్టుకున్నారు. నేతాజీ, గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతమాత భారతమాత, తెలంగాణ తల్లి, బతుకమ్మలు, మిలటరీ జవాన్లు తదితర వేషాల విద్యార్థులు అలరించారు. ప్లకార్డులు చేత్తో పట్టుకొని అమరవీరులను స్మరిస్తూ నినాదాలు చేశారు.