ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి: కేటీఆర్

byసూర్య | Thu, Jan 26, 2023, 09:54 AM

హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌కే భవన్‌లో హైదరాబాద్‌ నగరంలో భవనాల్లో అగ్నిప్రమాదల ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నగరంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న భవనాలపై తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించారు. ఫైర్ సేఫ్టీ లేని భవనాల గుర్తింపు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలు, పాత భవనాలు, అక్రమ నిర్మాణాల కూల్చివేత, సెల్లార్లపై అక్రమ వ్యాపారాల నివారణకు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా డెక్కన్‌ స్పోర్ట్స్‌ మాల్‌లో గల్లంతైన మృతులకు కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మూడు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.

అలాగే భవనాల విషయంలో మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ భవనాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించగా. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ సూచించనున్నది. అలాగే అగ్నిమాపకశాఖకు భారీగా నిధులు కేటాయించాలని, ఈ బడ్జెట్‌లోనే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అగ్నిపకశాఖ ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణలు చేయాలి నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాన్నారు.

అగ్ని ప్రమాదాల నివారణలో ప్రభుత్వం చేపట్టే చర్యలో భవన యజమానులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఫైర్‌ సేఫ్టీ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రస్తుత ఫైర్‌ సేఫ్టీ చట్టాలను మార్చాలన్నారు. ఫైర్‌ సేఫ్టీ విషయంలో సాంకేతికతను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలని, విదేశాల్లో ఫైర్‌ సేఫ్టీపై అధ్యయనం చేయాలన్నారు. అవసరమైన ఆధునిక సామగ్రి అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అత్యవసర సామగ్రికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


Latest News
 

రేపు పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన Fri, Feb 23, 2024, 04:26 PM
నేడు పెనుబల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర పర్యటన Fri, Feb 23, 2024, 04:24 PM
రైతులపై కాల్పులు దారుణం Fri, Feb 23, 2024, 04:24 PM
మేడారం జాతర భక్తులకు అందుబాటులో హెలికాప్టర్ సేవలు Fri, Feb 23, 2024, 04:22 PM
సంఘం అభివృద్ధి కోసమే చైర్మన్ గా రావూరి Fri, Feb 23, 2024, 04:20 PM