లీకులు ఇచ్చేది వారే,,,కీలక వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్

byసూర్య | Wed, Jan 25, 2023, 09:27 PM

సీఎం కేసీఆర్‌కు సంబంధించిన వ్యక్తులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారన్నారు. వారు కోవర్టులుగా పని చేస్తూ లీకులిస్తున్నారని బీజేపీ నేత, హూజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  వ్యాఖ్యనించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణలో ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారాయి.


"2018లో మా నియోజకవర్గంలో కేసీఆర్ కొందరు చిల్లర గాళ్లను పెట్టుకుండు. డబ్బులిస్తే.. వాళ్లు నాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇస్తరు. 2018 ఎన్నికల్లో నా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేసీఆర్ డబ్బులు ఇచ్చిండు. నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిండు. కానీ నా ప్రజలు నా వెనుక నిలబడ్డరు. నాతో పాటు మరో 20 మందిని ఓడించే ప్రయత్నం చేసిండు. నాపై కొన్ని పత్రికల్లో కేసీఆర్ ఆసత్య వార్తలు రాయించిండు. కేసీఆర్ గారి మనుషులు అన్ని పార్టీలలో ఉంటరు. ఎవరికి తెలియకుండా ఇన్‌ఫార్మర్లను పెట్టుకుంటడు. వాళ్లే లీకులు ఇస్తుంటరు. వాళ్లే రాయిస్తుంటరు. ముద్దకు రానియ్రరు.. ముందుకు పోనియ్యరు. కేసీఆర్ తాను గొప్పగా ఎదిగే ప్రయత్నం చేయడు. ఇతర పార్టీలను బలహీనపరిచి తాను మాత్రమే ప్రత్యమ్నాయం అనే అనివార్యతను తీసుకొస్తడు. ఈ వెకిలి చేష్టలను కేసీఆర్ బంద్ చేసుకోవాలి.


ప్రపంచంలో ఏ పార్టీకి జాయినింగ్‌ కమిటీ లేదు. బీజేపీలో జాయినింగ్‌ కమిటీ పెట్టడం వల్ల పార్టీలో చేరే వారి పేర్లు లీక్‌ అవుతున్నాయి. అందుకే బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తెలంగాణ ఇంటలిజెన్స్ వ్యవస్థ మెుత్తం ప్రత్యర్థి పార్టీలపైనే ఉంటుంది. రాష్ట్రంలో జరిగే క్రైమ్‌లపై వాళ్ల దృష్టి ఉండదు. అధికార పార్టీ అయితేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతయ్. నేనే ఎమ్మెల్యేగా గెలిచి 13 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క అధికారిక కార్యక్రమం కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న.. కానీ ఆనాడు ఈ పరిస్థితి లేదు. ఇప్పటి వరకు నేను కలెక్టరేట్‌లో అడుగుపెట్టలేదు. తెలంగాణలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తది. కేసీఆర్ దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం." అని ఈటల రాజేందర్ అన్నారు. అయితే కోవర్టుల అంశంపై ఈటల చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు దారితీశాయి. ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉన్న తరుణంలో ఈటల చేసిన కోవర్ట్ కామెంట్స్ అన్ని పార్టీలను టెన్షన్‌కు గురిచేస్తున్నాయి.



Latest News
 

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోలీసులు ఆంక్షలు Mon, Dec 02, 2024, 04:28 PM
డిసెంబరు 4న 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు Mon, Dec 02, 2024, 04:26 PM
డిసెంబర్ 4 నుంచి తెలంగాణ జాగృతి సమీక్ష సమావేశాలు Mon, Dec 02, 2024, 04:23 PM
వైద్యాధికారి కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా Mon, Dec 02, 2024, 04:22 PM
సిద్ధిపేట మండలంలో కొండచిలువ కలకలం Mon, Dec 02, 2024, 04:21 PM