పఠాన్ సినిమా ఆడే థియేటర్ల వద్ద భారీ భద్రతా

byసూర్య | Wed, Jan 25, 2023, 11:48 PM

హెచ్చరికల నేపథ్యంలో పఠాన్ సినిమా ఆడే థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున్న భద్రతను కల్పించారు. వివాదాల మధ్య ఇవాళ విడుదలైన పఠాన్ మూవీకి చిక్కులు ఎదురవుతున్నాయి. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన 'పఠాన్' సినిమా షోలను హిందూ సంఘాలు అడ్డుకుంటున్నాయి. హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ సినిమాలోని 'భేషరమ్ రంగ్' అనే పాటలో హీరోయిన్ దీపికా పదుకొణే కాషాయ రంగు బికినీలో కనిపించడంపై హిందూ సంఘాల నుంచి విమర్శలు వస్తోన్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. థియేటర్ల వద్ద నిరసనలు చేపడుతూ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తుండటంతో.. సినిమా యూనిట్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.


హైదరాబాద్‌లో కూడా పఠాన్ మూవీకి అడ్డుంకులు ఎదురవుతున్నాయి. పఠాన్ మూవీ షోను అడ్డుకుంటామని పలు హిందు సంఘాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కాచిగూడ తారకరామ థియేటర్ ముందు సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ బాల గంగిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రశాంతంగా సినిమా షో పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. థియేటర్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హిందూ సంఘాల హెచ్చరికలతో హైదరాబాద్‌లో పఠాన్ షో థియేటర్ల దగ్గర పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.


అటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పఠాన్ షోను హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని సప్పా థియేటర్ వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో ఉదయం 9 గంటల షోను థియేటర్ యాజమాన్యం రద్దు చేసింది. ముంబైతో పాటు పలు రాష్ట్రాల్లో పఠాన్ షోను అడ్డుకునేందుకు హిందూ సంఘాలు ప్రయత్నాలు చేయడంతో.. పోలీసులు థియేటర్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారూఖ్ ఖాన్ సినిమా రావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోగా.. తొలి రోజు పాజిటివ్ టాక్ నడుస్తోంది.


యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. యష్ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. పఠాన్ మూవీ వ్యవహారం ఇటీవల లోక్‌సభలో కూడా చర్చకు వచ్చింది. సినిమాను బ్యాన్ చేయాలని కొంతమంది డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఇటీవల పఠాన్ మూవీపై బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. మనకు సంబంధం లేని సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సభలో సూచించారు.


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM