వాళ్లిద్దరికి ఇక్కడేంపని,,, ఆకునూరి మురళి

byసూర్య | Wed, Jan 25, 2023, 09:07 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీనియర్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి టార్గెట్ చేశారు. 'వేరే రాష్ట్రాల వాళ్లకు మా తెలంగాణలో ఏం పని..? కేసీఆర్‌కు ఆంధ్రలో ఏం పని..? షర్మిల(కడప జిల్లా)కు, పవన్ కళ్యాణ్ (భీమవరం జిల్లా)కు ఇక్కడేం పని..? బాగా డబ్బు ఉందని వీళ్లు రాజకీయ వ్యాపారం చేస్తున్నారు. అసలు వీళ్లకు ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది..? ఏం వ్యాపారాలు చేసిన్రు? అవినీతి డబ్బే కదా!' అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణలో పర్యటించడం, షర్మిల త్వరలోనే పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్న క్రమంలో.. ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.


ఇదిలావుంటే ఆకునూరి మురళి తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు. పదవీకాలం ఇంకా ఏడాది మిగిలి ఉండగానే.. ఐఏఎస్‌కు స్వచ్చంధ పదవీ విరమణ చేసిన ఆయన.. ఆ తర్వాత పొలిటికల్ అరగ్రేటం చేశారు. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలతో కాక పుట్టిస్తున్నారు. ఆయన చేసే విమర్శలు, ఆరోపణలు కాక రేపుతోన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎప్పుడూ ఆరోపణలు చేసే ఆకునూరి మురళి.. ఈ సారి కాస్త రూటు మార్చారు. 


ఎప్పుడూ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్‌పై విమర్శలు చేసే ఆయన.. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేలా పవన్, షర్మిలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు మురళి ఇటీవల ప్రకటించగా.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగానే కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను తప్పుబడుతూ వస్తోన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపించడం, తనకు ప్రాధాన్యత లేని పోస్టు ఇవ్వడంతోనే వీఆర్ఎస్ తీసుకున్నట్లు చెబుతూ వస్తోన్నారు. ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేసిన తర్వాత.. ఏపీలో జగన్ ప్రభుత్వంలో విద్యాశాఖ మౌలిక సదుపాయాల సలహాదారుడిగా పనిచేశారు. కొంతకాలం తర్వాత ఆ పదవికి కూడా రాజీనామా చేసి తన సొంత రాష్ట్రమైన తెలంగాణ రాజకీయాలపై మురళి దృష్టి పెట్టారు.



Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM