byసూర్య | Wed, Jan 25, 2023, 08:57 PM
తెలంగాణ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగాయి. ప్రభుత్వం ఏకంగా 60 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఎస్పీ నుంచి ఐజీ స్థాయి వరకు అధికారులను బదిలీ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న 45 పోస్టులను ప్రభుత్వం ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది.