ఇద్దరు సెల్ ఫోన్ దొంగల అరెస్టు.. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ

byసూర్య | Wed, Jan 25, 2023, 02:54 PM

జిల్లాలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన తన్నీరు ప్రభాకర్, అతడి అక్క లక్కరాజుల చంద్రకళ ఇద్దరు కామారెడ్డి పట్టణంతో పాటు ఆర్మూర్, నిజామాబాద్ లో తరచూ సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కామారెడ్డి పట్టణంలో డిగ్రీ కళాశాలలో పార్క్ చేసిన వాహనం డిక్కీ పగలగొట్టి ఏడు సెల్ ఫోన్లను దొంగలించారు. వీరు సెల్ఫోన్లను హైదరాబాద్కు అమ్మేందుకు తీసుకెళ్తుండగా టేక్రియాల్ చౌరస్తా వద్ద వీరి ద్విచక్రవాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 18 సెల్ఫోన్ లు లభ్యమయ్యాయి అన్నారు. వీరిద్దరిని విచారించగా నేరం ఒప్పుకున్నారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ. 3. 45 లక్షల విలువ చేసే 8 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్న రిమాండ్కు తరలించమని ఎస్పీ తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన దేవునిపల్లి ఎస్సై పబ్బ ప్రసాద్, బాల్ రెడ్డి, రవీంద్ర కుమార్, రాజు, రవి కిరణ్, పరంధాములు, రామస్వామిని అభినందించారు.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM