గ్రామ పంచాయతీకి వెంటనే నిధులు విడుదల చేయాలి

byసూర్య | Wed, Jan 25, 2023, 02:29 PM

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ సభ మంగళవారం సర్పంచి రామకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామపంచాయతీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని సర్పంచ్ రామకృష్ణ రావు తో పాటు సభ్యులు చెప్పారు. గ్రామంలో చేపట్టిన రైతు వేదిక ప్రహరీ గోడ నిర్మాణం, క్రీడా ప్రాంగణం, మురుగు కాలువల నిర్మాణం, వీధి దీపాలు, సీసీ రోడ్ల బిల్లులు ఇవ్వవలసి ఉందని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికాలంగా నిధులు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల కాలంగా నిధులు విడుదల చేయలేదని సభ్యులు తెలిపారు. గ్రామంలోని ఎస్సి వాడలో నీటి ఇబ్బందులు ఉన్నందున మూడు మినీ ట్యాంకులు నిర్మించడానికి గ్రామ సభ తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఖదీర్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ మనయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM