ఆస్కార్ కు 'నాటు నాటు' సాంగ్ నామినేట్,,,చిత్ర యూనిట్‌కు బండి సంజయ్ అభినందనలు

byసూర్య | Wed, Jan 25, 2023, 12:53 PM

ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డులు దాసోహం అవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. ఆస్కార్ నామినేషన్స్‌లో స్థానం సంపాదించుకున్న తొలి తెలుగు పాటగా 'నాటు నాటు' చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. తెలుగు జాతికే ఇది గర్వకారణమని ప్రశంసిస్తున్నారు.


ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఈ పాట రాయగా.. కాల భైరవతో కలిసి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాట పాడాడు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్‌లో నిలవడంతో రాహుల్ సిప్లిగంజ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానించారు. శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను బండి సంజయ్ తన ట్విట్టర్‌లో పంచుకోవడంతో వైరల్ అవుతోన్నాయి. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ బృందానికి బండి సంజయ్ అభినందనలు తెలిపారు. నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ కావడాన్ని గర్విస్తూ రాహుల్ సిప్లిగంజ్‌తో సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


'రాహుల్ సిప్లిగంజ్ అపూర్వ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. హైదరాబాద్ కుర్రాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాటను పాడాడు. ఆర్ఆర్ఆర్ బృందానికి నా అభినందనలు. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా' అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా రాహుల్ సిప్లిగంజ్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు. మరిన్ని మంచి పాటలు పాడి టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.


ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు సాంగ్.. ఇప్పుడు ఆస్కార్ అవార్డు రేసులో నిలవడం మరో మైలురాయిగా చెప్పవచ్చు. ఒక తెలుగు పాట ఆస్కార్ వరకు వెళ్లడం తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచింది. మార్చిలో ప్రకటించనున్న ఆస్కార్ అవార్డులలో ఈ పాట అవార్డు దక్కించుకోవాలని తెలుగువారందరూ ఆశిస్తున్నారు. ఆస్కార్ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో నిలిచిన నాటునాటు సాంగ్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి వ్యవహరించగా.. ఇందులో ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఉత్తమ హీరోల జాబితాలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కూడా ఆస్కార్ ప్రిడిక్షన్స్ లిస్టులో చేరారు. కానీ వారిద్దరూ నామినేట్ కాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఉత్తమ డైరెక్టర్ కేటగిరీలో రాజమౌళి కూడా ప్రిడిక్షన్స్ లిస్టులో చోటు దక్కించుకోగా.. నామినేషన్స్‌లోకి వెళ్లలేదు.



Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM