మెదక్ జిల్లా శివనూరులో విషాదం,,,ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి

byసూర్య | Wed, Jan 25, 2023, 12:54 PM

గ్యాస్ సిలిండర్లు ప్రజల ప్రాణాలకు ముప్పుగా తయారవుతున్నాయి. ఇదిలావుంటే మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరులో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంజమ్మ తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. నగరంలోనే ఉపాధి పొందుతూ అప్పుడుప్పుడూ స్వగ్రామానికి వచ్చి వెళుతుండేవారు.


ఇదిలావుంటే అంజమ్మ తన పెన్షన్ డబ్బులు, రేషన్ బియ్యం తీసుకునేందుకు గాను మనవరాలు ముధు (6)తో కలిసి మంగళవారం గ్రామానికి వచ్చింది. అనంతరం రాత్రి తన ఇంట్లో మనవరాలు మధుతో కలిసి నిద్రించింది. ఈ క్రమంలో అర్థరాత్రి అంజమ్మ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలి పోయింది. అప్రమత్తమైన గ్రామస్థులు అగ్ని మాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురాగా.. అప్పటికే అంజమ్మ, మధు సజీవదహనమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


 


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM