పంటను కాపాడుకొనేందుకు.... కుక్కను పులిలా మార్చిన రైతన్న

byసూర్య | Wed, Jan 25, 2023, 12:53 PM

కాయకష్టంచేసి పండించిన పంటను కాపాడుకొనేందుకు ఓ అన్నధాత అందరినీ ఆసక్తికరమైన ఆలోచన చేశాడు. మానవ జాతిపై వానర జాతి ఆధిపత్యం సాధిస్తుందని అప్పుడెప్పుడో ఓ మ్యాగజీన్‌లో చదివా. అది ఇదేనేమో. ప్రస్తుతం పగలు - రాత్రి, ఊరు - పొలం అన్న తేడా లేకుండా కోతుల గుంపులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మర్కట మూకలు ముప్పేట దాడి చేస్తున్నాయి. వాటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నాయి. కోతుల దాడుల్లో గాయపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అటూ రైతులకు పంట నష్టం తప్పడం లేదు.


కోతుల బెడద నుంచి పంటను రక్షించుకునేందుకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం బూర్గుగూడెంకు చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఓ కుక్కకు పులి వేషం వేసి పంట చేను వద్ద కాపలాగా ఉంచాడు. కుక్కకు శరీరంపై నలుపు రంగుతో పులి చారలు మాదిరిగా గీతలు గిసి చేనులో ఉంచాడు. పులిలా భ్రమ కల్పిస్తున్న కుక్కను చూసి కోతులు భయపడిపోతున్నాయి. దీంతో వానర మూక అటువైపుగా రావటం లేదు. దీంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. రైతు ఐడియా అదుర్స్ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.


Latest News
 

బీఆర్ఎస్‌ పార్టీలో చెత్తంతా పోయింది, ఇక మిగిలింది వాళ్లే.. అసెంబ్లీ మాజీ స్పీకర్ Fri, Mar 29, 2024, 07:26 PM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనం.. దేశంలోనే తొలిసారిగా ఆ కేసు నమోదు Fri, Mar 29, 2024, 07:23 PM
చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM