ఆ రోగిని నిమ్స్ కు తరలించండి...ప్రభుత్వాన్ని కోరిన ఎంబీటీ

byసూర్య | Tue, Jan 24, 2023, 05:01 PM

ఓ రోగి ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసిన ఎంబీటీ పార్టీ ఆయనకు ప్రభుత్వ పరంగా వైద్యం అందేలా చేయాలని కోరింది. ఇదిలావుంటే ప్రస్తుతం విద్య, వైద్యం చాలా ఖరీదుగా మారాయి. ఎంతగా పెరిగాయంటే.. ఆస్పత్రి బిల్లు చెల్లించడానికి ఆస్తులు కూడా అమ్ముకునే వరకు చేరాయి. గుండెపోటు వచ్చి ఆస్పత్రికి వెళ్తే బిల్లు చూసి మరోసారి గుండె పోటు వచ్చేలా ఉంది. తాజాగా ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బిల్లు రిసిట్ చూసి చాలా మంది షాకయ్యారు. మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ షేర్ చేసిన ఆసుపత్రి బిల్లు ప్రకారం, హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో 10 రోజుల చికిత్స కోసం సయ్యద్ రహ్మత్ ఉద్దీన్ అనే రోగికి 54 లక్షలు వసూలు చేశారు.


రోగి కుటుంబ సభ్యులు ఇప్పటివరకు రూ.20 లక్షలు చెల్లించారని ఖాన్ పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో, ఆసుపత్రి ఇంకా రూ. 29 లక్షలు డిమాండ్ చేస్తుందని పేర్కొన్న ఖాన్, రోగిని గాంధీ లేదా నిమ్స్ ఆసుపత్రికి తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. 


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM