ఈ కేసులో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు: వై.ఎస్.షర్మిల

byసూర్య | Tue, Jan 24, 2023, 04:59 PM

కడపలో వైఎస్ వివేకానందరెడ్డి గొప్ప నాయకుడు అని, హత్య జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఎటూ తేలడం లేదని, హత్య కేసును తొందరగా తేల్చాలని కోరుతున్నట్లు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. కేసులో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని షర్మిల సూచించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులివ్వడంపై షర్మిల పై విధంగా స్పందించారు. 


ఈ నెల 28 నుంచి తెలంగాణలో పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. ఎక్కడైతే పాదయాత్రను ఆపేశారో.. అక్కడ నుంచే తిరిగి ప్రారంభిస్తానని తెలిపారు. పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ అని, ఆయనపై కాంగ్రెస్‌లోనే నమ్మకం లేదని ఆరోపించారు.


గత కొద్దిరోజులుగా అమెరికా పర్యటనలో షర్మిల ఉన్నారు. తల్లి విజయమ్మతో కలిసి సంక్రాంతికి ముందు షర్మిల అమెరికాకు వెళ్లారు. అమెరికా టూర్ ముగించుకుని సోమవారం ఉదయం షర్మిల హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో షర్మిలకు వైఎస్సార్‌టీపీ నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్‌కు చేరుకోగానే షర్మిల కేసీఆర్ టార్గెట్‌గా దూకుడు పెంచారు. ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శనస్త్రాలు సంధించారు. బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనలపై షర్మిల స్పందించారు.


'పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, భవిష్యత్తును చక్కదిద్దే గురువులు, ప్రగతి భవన్ ముందు పిల్లాపాపలతో ఆర్తనాదాలు చేయాల్సిన దుస్థితికి తీసుకొచ్చాడు సైకో కేసీఆర్. 317జీవోను సవరించి న్యాయం చేయాలని ఉపాధ్యాయులు కంటతడి పెడుతున్నా మదమెక్కిన దొర.. గడీ దాటి బయటికి రావడం లేదు. నీ రాక్షసత్వం. పక్కనపెట్టి, బ్లాక్ చేసిన 13 జిల్లాల స్పౌజ్బ బదిలీలు వెంటనే చేపట్టాలని, 2100మంది భార్యాభర్తలకు ఒకేచోట పోస్టింగ్ ఇవ్వాలని వైఎస్సార్టీపీ డిమాండ్ చేస్తోంది. స్థానికత కోల్పోతున్నామని ఆందోళనలో ఉన్న 15వేల మంది టీచర్లకు న్యాయం చేయాలని,బదిలీల్లో జీరో సర్వీసుకు అనుమతివ్వాలని కోరుతున్నాం' అంటూ షర్మిల ట్వీట్ చేశారు.


Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM