ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

byసూర్య | Tue, Jan 24, 2023, 04:44 PM

ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాచిగూడ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ ఏటీఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎం లలో దొంగతనాలకు పాల్పడి తప్పించుకొన్నారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు తో దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. హబ్సిగూడా లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వైట్ అక్టీవా లో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా నేరాన్ని అంగీకరించారు. వీరు ముక్కపాటి మనోహర్ (22) కృష్ణారెడ్డి కాలనీ ఉప్పల్ , తాడూరు దీపక్ (18) న్యూ రాం నగర్ కాలనీ , ఉప్పల్ గా గుర్తించారు. మరో వ్యక్తి మైనర్ గా గుర్తించారు. వీరి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనాన్ని, ఐదు మొబైల్ ఫోన్స్, దొంగతనని ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.

Latest News
 

విద్యుత్ ఘాతంతో ఇరువురు మృతి Fri, Feb 23, 2024, 03:42 PM
షబ్ ఎ బరాత్ కు సెలవు ఇవ్వాలి: జహంగీర్ బాబా Fri, Feb 23, 2024, 03:39 PM
నల్లమలలో గుప్తనిధుల కోసం వేట Fri, Feb 23, 2024, 03:38 PM
కల్వకుర్తి డిఎస్పీగా పల్లె వెంకటేశ్వర్లు Fri, Feb 23, 2024, 03:36 PM
మతిస్థిమితం లేని వృద్ధుడు మృతి Fri, Feb 23, 2024, 03:33 PM