ఏసిడి చార్జీలను వెంటనే తగ్గించాలని ఏఈ కి వినతి పత్రం

byసూర్య | Tue, Jan 24, 2023, 02:51 PM

కోటగిరి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ముందు సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించి ఏఈ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఏ విట్టల్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితాల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ అనునిత్యం వాడేటటువంటి వాటిపై భారాలను మోపడం అన్యాయం అన్నారు. కరెంట్ చార్జీలతో పాటు ఈ నెల బిల్లులో ప్రతినెల సాధారణ వసూలు చేసే చార్జీలకు అదనంగా ఏ సి డి చార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారాలు మోపడం సరికాదన్నారు. ప్రతినెల ఇంధన సర్చార్జిలను పెంచుకోవడానికి డిస్ట్రిబ్యూటర్ కమిటీ (డిస్కం)లకు విద్యుత్ నియంత్రణ మండలి స్వేచ్ఛ కల్పించడానికి సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, ఏసిడి చార్జీలను వెంటనే ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM