పాద‌యాత్ర‌లో బండి సంజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

byసూర్య | Thu, Dec 08, 2022, 12:03 PM

నిర్మల్ జిల్లాలో తన పాదయాత్రకు విశేష ఆదరణ లభించిందని, నిర్మల్ జిల్లాను జీవితంలో ఎన్నటికీ మరిచిపోనని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ఐదో విడత పాదయాత్ర నిర్మల్ జిల్లాలో విజ‌య‌వంతంగా పూర్తైంది. పాద‌యాత్ర‌ బుధవారం రాత్రి జిల్లా సరిహద్దుల్లో ముగిసింది. బైంసా పట్టణంలో మొదలైన బండి ప్రజాసంగ్రామయాత్ర 10 రోజులపాటు కొనసాగి నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదంకుర్తి వద్ద ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బండి పాదయాత్రతో కార్య‌క‌ర్త‌ల్లో నూత‌నోత్సాహం నిండింది. పాద‌యాత్ర‌లో అన్ని చోట్లా జ‌నం భారీగా పాల్గొన్నారు. బైంసా, నిర్మల్, ఖానాపూర్ సభల్లో తరలివచ్చిన జనంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బండి పర్యటనలో బండి ప్ర‌సంగాలు యువతను ఆకర్షించడం స‌క్సెస్ అయ్యార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.


Latest News
 

సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ Thu, Feb 29, 2024, 04:24 PM
నిత్యం ప్రజలకు అందుబాటులో Thu, Feb 29, 2024, 03:32 PM
'ధరణి' బాధితులకు గుడ్‌న్యూస్ Thu, Feb 29, 2024, 03:07 PM
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర Thu, Feb 29, 2024, 03:07 PM
శివాలయం భూమి పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే Thu, Feb 29, 2024, 03:06 PM