![]() |
![]() |
byసూర్య | Thu, Dec 08, 2022, 11:43 AM
తెలంగాణ చేనేత వస్త్ర పరిశ్రమ నైపుణ్యం, ఆ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్ టెక్స్ టైల్ రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు కురిపించారు. బుధవారం మంత్రి కే. తారకరామారావు (కేటీఆర్) తో కైరా హైదరాబాద్ ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. దీర్ఘకాలం పాటు తాము కొనసాగిస్తున్న చేనేతల అధ్యయనంలో భాగంగా ఆమె తెలంగాణలో పర్యటిస్తున్నారు.