బ్యాంకు రుణాలు సకాలంలో అందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

byసూర్య | Thu, Dec 08, 2022, 11:26 AM

బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి బ్యాంకర్లకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆమె బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, గత సెప్టెంబరు వరకు 631 కోట్లు వ్యవసాయ పంట ఋణాలుగా అందచేయడం జరిగిందని, దీనిలోనే వ్యవసాయ దీర్ఘకాలిక ఋణాలుగా 297 కోట్లతో మొత్తంగా వ్యవసాయ రంగానికి 928 కోట్లు బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ ఋణాలను సకాలంలో అందించి లక్ష్యాలను సాధించాలని, రైతులు పంట ఋణాలు సకాలంలో చెల్లించేలా అధికారులు క్షేత్ర స్థాయిలో శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. సూక్ష్మ ఋణాల క్రింద సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు గాను 167 కోట్లు ఇవ్వడం జరిగిరదని, విద్యా ఋణాలుగా 8 కోట్లు, గృహ ఋణాలుగా 19 కోట్లు అందించడం జరిగిందని, అంతే కాకుండా ప్రాధాన్యతా రంగాలకు 13 కోట్లు అందించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు సకాలంలో ఋణాలు అందచేసి లబ్దిదారులకు ప్రయోజనం కల్పించాలని సూచించారు. జిల్లాలో 11903 మహిళా సంఘాలకు 518 కోట్ల ఋణాలు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, దీనిలో ఇప్పటి వరకు 5814 సంఘాలకు గాను 334 కోట్లు అందించి 57 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, అర్హత ఉన్న సంఘాలకు ఋణాలు వెంటనే అందించాలని, రెన్యువల్ లో ప్రాసెసింగ్ ఫీజు లేకుండా చూడాలని తెలిపారు. మెప్మా క్రింద 680 సంఘాలకు గాను 315 సంఘాలకు 42 కోట్ల 50 లక్షలకు 23 కోట్ల 6 లక్షలు ఋణాలుగా అందించడం జరిగిందని, అలాగే వీధి వ్యాపారులకు అందించే 20 వేల రూపాయల ఋణానికి సంబంధించి జిల్లాలో 4242 వీధి వ్యాపారులకు 8 కోట్ల 48 లక్షల 40 వేలకు గాను 2078 మంది వ్యాపారులకు 4 కోట్ల 15 లక్షల 60 వేలు అందించి 54 శాతం లక్ష్యం సాధించడం జరిగిందని తెలిపారు. ఈనెల 20 లోగా 5 వ తరగతి నుండి 10 వ తరగతి చదువుతున్న ఎస్. సి. , ఎస్. టి. విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన పథకం క్రింద జీరో బ్యాలన్స్ అకౌంట్లు ఎలాంటి జాప్యం లేకుండా ఓపెన్ చేయాలని, తద్వారా జిల్లాలో 1800 మంది విద్యార్థులు లబ్దిపొందుతారని తెలిపారు. వీధి వ్యాపారులకు మొదటి విడుత పది వేలు సకాలంలో చెల్లించిన వారికి రెండవ విడుతగా 20 వేలు సత్వరమే అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. పి. ఎం. ఇ. జి. పి. , పి. ఎం. ఎఫ్. ఎం. ఇ. ఋణాలు లబ్దిదారులకు సకాలంలో అందించాలని సూచించారు. పాడి, మత్స్య పరిశ్రమలకు సంబంధించి లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ ఋణాలు సకాలంలో ఇవ్వాలని తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM