పెద్దపాడులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

byసూర్య | Tue, Dec 06, 2022, 05:03 PM

బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే మంగళవారం భూమి పూజ చేసి, పనులను ప్రారంభించినారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటనప్రకారం ఈ పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమవుతుంది అన్నారు. గద్వాల నియోజకవర్గంలో ధరూర్ మండలం పరిధిలోని , పెద్దపాడు గ్రామంలో బిసి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే కి సర్పంచ్లు, తెరాస నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే 22లక్షలు వ్యయంతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.


అనంతరం గ్రామంలోని శివాలయంలో శివపార్వతి కళ్యాణం మహోత్సవంలో పాల్గొని ఎమ్మెల్యే స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజ చేసి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కొరకు అనేకమైన పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజల లబ్ధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుంది అని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల లబ్ధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుంది అదే విధంగా దాన్ని కులాలను గౌరవిస్తూ వారికి పూర్వ వైభోగం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా అహర్నిశలు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది.


తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా నిధులు కేటాయించుకొని ప్రతి గ్రామంలోని పేద ప్రజలు వివాహ శుభ కార్యాలు జరుపుకోవడానికి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ లోను ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ లో బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకుకేటాయించడం జరిగినది. ప్రతి ఇంటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి రైతుబంధు, 24 గంటల కరెంట్, రైతు భీమా, ఇంటింటికి మంచినీళ్లు ఆసరా పింఛన్, వంటి పథకాలు అమలు చేసి పార్టీలకతీతంగా ప్రజలకు సమానంగా ప్రతి సంక్షేమ పథకాలను అందించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ని తెలిపారు


పక్క రాష్ట్రంలో తెలంగాణ లో అమలు చేస్తున్న పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి ప్రజలు బిజెపి పార్టీ నాయకులకు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు. ప్రజలందరూ టిఆర్ఎస్ పార్టీ ని నన్ను మరొక్కసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నజూమున్నీసా బేగం, జెడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర్ రెడ్డి , వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ విజయ్ భాస్కర్ రెడ్డి, మండలం పార్టీ అధ్యక్షుడు విజయ్, మన్నా పురం సర్పంచ్ మహబూబ్, తెరాస పార్టీ నాయకులు చక్రధర్ రావు, ప్రభాకర్ గౌడ్, వేణుగోపాల్ రావు, కురుమన్న, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM