నాలుగు నెలల జీతాలను వెంటనే మంజూరు చేయండి

byసూర్య | Tue, Dec 06, 2022, 05:06 PM

గట్టు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గట్టు ఎంపీడీవో చెన్నయ్య కి వినతి పత్రంఅందజేశారు. గ్రామపంచాయతీ వర్కర్స్ పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల జీతాలు వెంటనే ఇయ్యాలని, కార్మికుల పని భారాన్ని తగ్గించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కనీసం 26, 000 అమలు చేయాలని, వారంత సెలవులు ఇవ్వాలని కార్మికుల కనీస అవసరమైన శానిటైజర్ సబ్బులు, నూనె బ్లౌజులు బూట్లు డ్రెస్సులు ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేసే పని భారాన్ని తగ్గించాలని అధునపు సిబ్బంది నియమించాలని సామాజిక భద్రత కల్పించాలని వారు ఎంపీడీవోకు తెలియజేశారుఈఎస్ఐలు అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సి ప్రకారం 30% ఫిట్మెంట్ గ్రామపంచాయతీ కార్మికులకు వర్తింపచేయాలని, విడుదల చేసిన ఐదో జీవోలు 21 నుండి 25 లను వెంటనే రాజపత్రం గెజిటెడ్ ముద్రించాలన్నారు ఇన్సూరెన్స్ ప్రమాద మరణానికి 10 లక్షలు సహజ మరణానికి ఐదు లక్షలు పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ జిల్లా కార్యదర్శి జమ్మిచెట్టు కార్తిక్, నరసింహులు, కోటన్న, నూరు, వినోద్ కుమార్ మోహన్  తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఎర్రవల్లికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Sat, May 11, 2024, 05:40 PM
రైతు బిడ్డనైన తనను ఆశీర్వదించండి: నామా Sat, May 11, 2024, 05:37 PM
14 సీట్లు గెలిపిస్తే.. తెలంగాణ తడాఖా ఏందో దేశ రాజకీయాల్లో చూపిస్తా : కేసీఆర్ Sat, May 11, 2024, 05:10 PM
నలుగురి కంటే ఎక్కువ మంది తిరగొద్దు : సీఈఓ వికాస్ రాజ్ Sat, May 11, 2024, 04:43 PM
కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన నాయకులు Sat, May 11, 2024, 04:37 PM