సీఎం కేసీఆర్ నుంచి నాకు ప్రాణ హామీ ఉంది: వై.ఎస్.షర్మిల

byసూర్య | Mon, Dec 05, 2022, 11:45 PM

తనకు కేసీఆర్ నుంచి, ఆయన గూండాల నుంచి ప్రాణహాని ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాదయాత్ర కేసీఆర్ రాజకీయాలకు అంతిమయాత్ర అవుతుందని అన్నారు. తన పాదయాత్రను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయం పట్టుకుందని ఆమె అన్నారు. అందుకే తన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు తన పాదయాత్రను మూడు సార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని షర్మిల చెప్పారు. పోలీసులు ప్రజల కోసం కాకుండా... కేసీఆర్ కోసం, ఆయన కుటుంబం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. పోలీసులను ముఖ్యమంత్రి పనివాళ్లుగా వాడుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నందుకే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతిని ఇచ్చినప్పటికీ... పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని... ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అన్నారు. 


నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడితే... తాము శాంతిభద్రతలకు విఘాతం కలిగించామని కేసులు నమోదు చేయడం ఏమిటని ఆమె మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే వారి నియోజకవర్గాల్లో పబ్లిక్ ఫోరంను ఏర్పాటు  చేయాలని... వారి అక్రమాలను, అవినీతిని తాను అక్కడే నిరూపిస్తానని సవాల్ విసిరారు.Latest News
 

అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు Fri, Feb 03, 2023, 10:23 AM
ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం Thu, Feb 02, 2023, 10:00 PM
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభం... హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ Thu, Feb 02, 2023, 08:52 PM
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM