ఆ నేతల నజర్ అంతా ఇపుడు తెలంగాణపైనే

byసూర్య | Mon, Dec 05, 2022, 11:45 PM

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఎన్నికలపై నజర్ పెట్టిన మోడీ, అమిత్ షా ద్వయం తాజాగా ఇపుడు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంపై నజర్ పెట్టినట్లు సమాచారం. ఇదిలావుంటే మోదీ, అమిత్ షా ద్వయం తెరపైకి వచ్చాక.. ప్రతీ ఎన్నికనూ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి పనిచేశారు. అన్నిసార్లు కాకపోయినా.. ఎక్కువసార్లు అనుకున్న ఫలితాలను రాబట్టారు. అందుకు ఉదాహరణే ఈ మధ్య ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో జయకేతనం ఎగరేసిన కమలం.. తాజాగా ఎన్నికలు జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లోనూ వికసిస్తుందని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. మొత్తానికి వారి ముందు ఇప్పటివరకు ఉన్న మిషన్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ముగిసింది. దీంతో ఇప్పుడు మరో రాష్ట్రంపై మోదీ, షా ద్వయం కన్నేసిందని తెలుస్తోంది.


దక్షిణ భారతదేశంలో.. కర్ణాటక తర్వాత బీజేపీకి రాజకీయంగా అనుకూలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. దీంతో ఎప్పటినుంచో తెలంగాణలో పాగా వెయ్యాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్టు అడుగులు వేస్తోంది. ఇటు తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో కమలదళం కదనరంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. సంజయ్ కూడా కేసీఆర్ సర్కారును గద్దె దింపాలని కసిగా పని చేస్తున్నారు.


రాష్ట్ర నేతల పరిస్థితి అలా ఉంటే.. ఇప్పటివరకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌పై ఫోకస్ పెట్టిన మోదీ, షా ద్వయం.. ఇకనుంచి తెలంగాణపై ఫోకస్ పెట్టనుందని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన కొందరు నేతలతో అమిత్ షా మాట్లాడారని సమాచారం. తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర నేతల దగ్గర ఉన్న ప్లాన్ ఏంటో అమిత్ షా తెలుసుకున్నారని తెలుస్తోంది. దానికి మోదీ, షా ఆలోచనలను కలిపి రంగంలోకి దిగాలని బీజేపీ భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఫైనల్‌గా ఒక రూట్ మ్యాప్‌ను తయారు చేసి.. బీజేపీ పెద్దలు తెలంగాణలో అడుగుపెట్టనున్నారు.


ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడింది. కానీ.. రెండో స్థానంలో నిలిచి టీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసిరింది. ఇక తెలంగాణలో తామే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెబుతోంది. 2023 ఎన్నికలకు మునుగోడు సెమీ ఫైనల్ అని అన్ని పార్టీలు భావించాయి. అలాంటి ఎన్నికలో అతికష్టం మీద టీఆర్ఎస్ బయటపడింది. అది కూడా లెఫ్ట్ పార్టీల మద్దతుతో. సాధారణ ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. దీంతో టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడం పెద్ద కష్టం కాదనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. చేరికలపైనా బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.


బీజేపీ పెద్దల ప్లాన్‌ను పసిగట్టిన కేసీఆర్.. అందుకు తగ్గట్టు వ్యూహాలు రచిస్తున్నారు. ఇది ఎన్నికల ఏడాది అని ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన కేసీఆర్.. బీజేపీకి తెలంగాణలో చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడుకు ధీటుగా కేసీఆర్ తన అధికారాన్ని వాడుతున్నారు. అటు మోదీ, షా ద్వయం.. ఇటు కేసీఆర్ వ్యూహాలతో తెలంగాణ రాజకీయంగా రసవత్తరంగా మారే ఛాన్స్ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయనే సూచనలు కనిపిస్తున్నాయి.



Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM