ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదుగా.... సీబీఐకి రెండో లేఖ రాసిన కవితా

byసూర్య | Mon, Dec 05, 2022, 11:46 PM

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాలో తన పేరు లేదని సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసాిరి లేఖ రాశారు. ముందుగా ఖరారైన కొన్ని కార్యక్రమాల నేపథ్యంలో, రేపటి విచారణకు తాను హాజరుకాలేనని ఆమె తెలిపారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా తన నివాసంలో విచారణ జరపవచ్చని చెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని, విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఇంతకు ముందే కవిత సీబీఐకి తొలి లేఖ రాశారు. ఐఎఫ్ఐఆర్ కాపీ, డాక్యుమెంట్లు తనకు పంపాలని... ఆపై విచారణ తేదీని ఖరారు చేయవచ్చని చెప్పారు. ఆమె కోరిన విధంగానే సీబీఐ అధికారులు వాటిని ఆమెకు పంపించారు. వాటిని పరిశీలించిన కవిత ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని సీబీఐకి రెండో లేఖ రాశారు. దీనిపై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.Latest News
 

ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం Thu, Feb 02, 2023, 10:00 PM
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభం... హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ Thu, Feb 02, 2023, 08:52 PM
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM