నుమాయిష్ ఎగ్జిబిషన్‌ ఎంట్రీ ఫీజు పెంపు.... రూ.40కి పెంపు

byసూర్య | Mon, Dec 05, 2022, 11:42 PM

నుమాయిష్ ఎగ్జిబిషన్‌ ఫీజు పెరిగింది. ఎంట్రీ ఫీజు రూ. 40కి పెంచారు. ఇద్దంతా ఏ నూమా‍యిష్ గురించి అంటున్నారా...? హైదరాబాద్ వాసులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అదేనండి.. నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు వేళైంది. గత మూడేళ్లుగా ప్రమాదాలు, వైరస్‌ ఉద్ధృతుల కారణంగా ఏర్పడిన అవాంతరాలతో నుమాయిష్ ప్రదర్శనను పూర్తిగా ఆస్వాధించలేని నగరవాసులు.. ఈసారి నిర్వహించే ఎగ్జిబిషన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. 2023 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న నుమాయిష్ ప్రదర్శనకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకు ముందు జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే.. మూడేళ్లుగా ఏఐఐఈకి వస్తున్న నష్టాల కారణంగా.. సొసైటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానంగా ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజును పెంచాలని సొసైటీ నిర్ణయించింది. ఇంతకు ముందు 30 రూపాయలుగా ఉన్న టికెట్ ధరను పది రూపాయలు పెంచి.. 40 రూపాయలుగా నిర్ణయించింది. ఇక పార్కింగ్ రుసుము విషయంలో మాత్రం.. ఎలాంటి మార్పులు లేకుండా ఫోర్ వీలర్స్‌కు 50 రూపాయలు, టూవీలర్స్‌కు 20 రూపాయలు వసూలు చేయనున్నారు. ఇక ఎగ్జిబిషన్ టైమింగ్స్‌లోనూ మార్పులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.


సాధారణంగా అయితే.. నుమాయిష్ ప్రదర్శన మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు ఉంటుంది. అదే వారాంతపు రోజుల్లో అయితే.. మూడు గంటల నుంచి పదొకొండింటి వరకు కొనసాగుతుంది. అయితే.. వారాంతాల్లో ప్రజలు ఎక్కువగా రాత్రి సమయంలోనే వస్తుండటం వల్ల.. పూర్తిగా ఎంజాయ్ చేయలేక అసంతృప్తితోనే వెనుదిరగాల్సి వస్తుందని వాదనలు వినిపించాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు.. ప్రదర్శనను వారాంతాల్లో పన్నెండింటి వరకు కొనసాగించేందుకు పోలీసులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అధికారుల చర్చలు సఫలమైతే.. నగరవాసులు దిల్ ఖుష్ అవటం ఖాయం.


నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారుల కోసం 1200 స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్యలపై గతంలో వ్యాపారులు, సందర్శకుల నుంచి వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా.. అధికారులు ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తాత్కాలిక లేదా పోర్టబుల్ టవర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. సందర్శకులకు ఉచిత ‘వైఫై’ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు వివిధ టెలికాం కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.


2019లో అట్టహాసంగా ప్రారంభమైన ఎగ్జిబిషన్‌లో ఊహించని రీతిలో విషాదం నెలకొంది. ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించి సుమారు 100కు పైగా స్టాళ్లు కాలి బూడిదైపోయాయి. ఆ విషాదం నుంచి తేరుకునేందుకు వ్యాపారులకు, సొసైటీకి చాలా సమయమే పట్టింది. కాగా.. ఆ తర్వాతి సంవత్సరమే అంటే 2020లో కరోనా విజృంభించి అసలు ప్రదర్శనే నిర్విహించలేని పరిస్థితి నెలకొంది. ఇక 2021లోనైనా నిర్వహిచాలని సంబురంగా ప్రారంభిస్తే.. ఒమిక్రాన్ విజృంభించటంతో ఒక్క రోజుకే రద్దు చేయాల్సి వచ్చింది. అయితే.. ఆ తర్వాత పరిస్థితి సద్ధుమణిగాక.. మార్చిలో మళ్లీ ప్రదర్శన నిర్వహించారు.


1938లో ఉస్మానియా గ్రాడ్యుయేట్‌ల సంఘం ఆర్థిక సంఘం ఆలోచన చేసినప్పుడు తొలిసారిగా నుమాయిష్‌-ఎ-మస్‌నుయాత్‌-ఏ-ముల్కీ నిర్వహించారు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని 1940 లో పబ్లిక్ గార్డెన్స్‌లో ఈ ప్రదర్శనను ప్రారంభించారు. మొదటి ఎగ్జిబిషన్ పబ్లిక్ గార్డెన్స్‌లో 1938లో నిర్వహించబడింది. దీనిని 1946లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మార్చారు. 1938లో దీనిని హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి అక్బర్ హైదరాబాద్ ప్రారంభించారు. 1939లో.. ఏడవ నిజాం కుమారుడు మోజమ్ జా బహదూర్ - మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని ప్రారంభించారు. మొదటి సారి ఈ ప్రదర్శనలో కేవలం 50 స్టాల్స్ మాత్రమే ఉండేవి. 1946లో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి సర్ మీర్జా ఇస్మాయిల్ ఈ ప్రదర్శనను ప్రస్తుత వేదికకు మార్చారు.


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM