జాతీయ రహదారులతో తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయి: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

byసూర్య | Mon, Dec 05, 2022, 11:41 PM

ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో తెలంగాణలో జాతీయ రహదారులు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు జాతీయ రహదారుల ద్వారా తెలంగాణ రూపు రేఖలు మారుతున్నాయని ఆయన అన్నారు.  1947 నుంచి 2014 వరకు తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు 2,500 కి. మీ. లు కాగా, గడచిన 8 ఏళ్లలోనే కొత్తగా మరో 2,500 కి. మీ.ల జాతీయ రహదారులను నిర్మించినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవును 5,000 కి. మీ. లకు పెంచినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.


తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు దిశల నుంచి హైదరాబాద్‌కు చేరుకునే ప్రజలు సులభంగా నగరంలోకి ప్రవేశించటానికి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. 350 కి.మీ.ల పొడవున నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ భాగాన్ని ఇప్పటికే భారతమాల ప్రాజెక్టులో చేర్చామని చెప్పారు. దాదాపు రూ.20,000 కోట్లతో నిర్మించనున్న సౌత్ భాగానికి సంబంధించిన డీపీఆర్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయని ఆయన వెల్లడించారు. జాతీయ రహదారులతో తెలంగామ రూపురేఖలు మార్చి.., తెలంగాణ అభివృద్ధిలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.


తెలంగాణలో ఎన్నో రహదారులను 4, 6 వరుసలుగా విస్తరించి రాష్ట్రంలో రహదారుల సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచామని కిషన్ రెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో సామాజిక అభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి తలుపులు తెరుచుకున్నాయన్నారు. తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్ర కేంద్రాలను, జిల్లాల కేంద్రాలను, ఈశాన్య రాష్ట్రాలతో సహా నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఉన్న అన్ని ప్రధాన పట్టణాలను కలుపుతూ మొత్తం దేశాన్ని ఏకం చేస్తూ అత్యంత వేగంగా జాతీయ రహదారులను నిర్మిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.



Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM