ఓయూ లో పోలిస్ కిష్టయ్య 13వ వర్థంతి

byసూర్య | Thu, Dec 01, 2022, 03:59 PM

మలిదశ తొలి అమరుడు పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య 13వ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ ముదిరాజ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ లక్ష్మీ గారి ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఓయూ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ ఆర్ట్స్ కళాశాల ఉస్మాని విశ్వవిద్యాలయం ఆవరణలో గురువారం ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలిస్ కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతిని నిర్వహించకపోవడం చాలా సిగ్గుచేటు అని ఆన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అమరులకు గుర్తింపు లేదని కుటుంబాలను ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ స్థూపం అని చెప్పి 8 ఏళ్లు గడుస్తున్నా నిర్మించకపోవడం తెలంగాణ అమరవీరుల అవమానించడమేనని ఆన్నారు. పోలీస్ కిష్టయ్య పేరుతో గౌరవ మెడల్ ప్రదానం చెయ్యాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెట్టి శంకర్ ముదిరాజ్, కొరివి బాలకృష్ణ ముదిరాజ్, జీడి భీమేష్ ముదిరాజ్, పులిగిల్ల యకన్న, సురేష్ నాయక్, శేఖర్ ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, బోయిన ఆదిత్య ముదిరాజ్, సాహిత్, పవన్ ముదిరాజ్, నాగ రాజు ముదిరాజ్, శివరాం, కుర్మ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

వాహనాలు తనిఖీ చేసిన సీఐ Tue, Apr 30, 2024, 10:13 AM
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM