రుణం పేరిట యువకుడికి సైబర్ వల

byసూర్య | Thu, Nov 24, 2022, 10:15 AM

ఆన్లైన్లో రూ. 50 వేలు రుణం ఆశ చూపి యువకుడిని వేధింపులకు గురైన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో చోటుచేసుకుంది. అతని ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి స్నేహితులకు పంపడం మొదలుపెట్టారు. ఈ మేరకు బుధవారం సైబర్ నేరాల హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫోన్ చేసి బిక్కనూరు పోలీసులను ఆశ్రయించాడు.


బాధితుడు జండ్రు రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, 20 రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటన ఆధారంగా మనీ వ్యూ అనే యాప్ ను తన ఫోన్లో ఇన్స్ స్టాల్ చేసుకున్నాడు. అందులో సూచించిన విధంగా వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్ కార్డులు చిత్రం అప్లోడ్ చేశాడు. వారం రోజులుగా గుర్తు తెలియని నంబర్ తో వాట్స్అప్ కాల్ చేసి డబ్బులు పంపాలని డిమాండ్ చేయసాగారు. తన చిత్రాలను అసభ్యంగా మార్చి స్నేహితులకు పంపారు. వారి ద్వారా విషయం తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM