ఘనంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలు

byసూర్య | Thu, Nov 24, 2022, 08:37 AM

పట్టణంలో కాంతివంతమైన వెలుగులతో అభివృద్ధిలో ముందుకు వెళుతుంది అని దేవరకొండ శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పుట్టినరోజు కానుకగా కొండమల్లెపల్లి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పట్టణాలలో వెలుగులు విరాజిల్లుతున్నాయి అని ఆయన తెలిపారు. ప్రతి పట్టణంలో ఎల్ఈడి కాంతులు విరాజీలనున్నాయి అని ఆయన తెలిపారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తా అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు కేసాని లింగా రెడ్డి, టిఆర్ఎస్ మండల, మండల అధ్యక్షులు రమావత్ దాస్రు, యువ నాయకులు గుమ్మడవల్లి షేక్ ఇస్మాయిల్. ఎలిమినేటి సాయి, గంధం సురేష్, నేనావత్ రాంబాబు నాయక్, వస్కుల కాశయ్య, మాడుగుల యాదగిరి, రమావత్ లాలు నాయక్, వెంకటయ్య, పాండు, సైద్ది రెడ్డి, రాములు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై వేణుస్వామి స్పందన.. ఆ వ్యాఖ్యలకు వీడియోతో క్లారిటీ..! Tue, Dec 05, 2023, 08:16 PM
తుఫానుపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు Tue, Dec 05, 2023, 08:13 PM
రావణ రాజ్యం ఎంజాయ్ చేయండి....తెలుగు సినీనటి సంచలన పోస్ట్ Tue, Dec 05, 2023, 07:20 PM
సీఎం కావటానికి సహకరించాలని...జగన్‌కు రేవంత్ రెడ్డి ఫోన్ కాల్.. సోషల్ మీడియాలో వార్త వైరల్ Tue, Dec 05, 2023, 07:18 PM
హైదరాబాద్‌లో ఒంటె మాంసం విక్రయం...ముగ్గురు నిందితులు అరెస్ట్ Tue, Dec 05, 2023, 07:17 PM