చెరువుగట్టు పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్త జనం

byసూర్య | Thu, Nov 24, 2022, 08:34 AM

నార్కెట్ పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో వెలిసిన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి కార్తిక మాసం చివరి రోజు బుధవారం అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమావాస్య కావడంతో ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటలు ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గుట్టపై వాహనాల వెళ్ళకుండ పోలీసులు వాహనాలను గుట్ట సమీపంలో పార్కింగ్ చేసే విధంగా ఏర్పాటు చేశారు.


Latest News
 

నారాయణపేటలో భూ భారతి దరఖాస్తుల వేగవంత పరిష్కారం Wed, Jun 18, 2025, 01:08 PM
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ Wed, Jun 18, 2025, 01:04 PM
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. గడ్డం వివేక్‌తో సహా కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ Wed, Jun 18, 2025, 01:03 PM
పచ్చదనం కోసం పిలుపు.. మునుగోడులో మొక్కల పండుగ Wed, Jun 18, 2025, 12:58 PM
స్థానిక ఎన్నికల గెలుపుకు కాంగ్రెస్ సర్వశక్తులు.. భారీ సభలతో రైతు భరోసా బూస్ట్ Wed, Jun 18, 2025, 12:54 PM