పురుగుల మందు తాగి విద్యార్ధిని ఆత్మహత్య

byసూర్య | Thu, Nov 24, 2022, 08:45 AM

తల్లితండ్రులు మందలించారని పురుగుల మందు తాగి విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన డిండి మండలం బ్రహ్మణపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం బ్రహ్మనపల్లి గ్రామానికి చెందిన అఖిల(16) దేవరకొండలోని ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్లో చదువుతోంది. నాలుగు రోజులక్రితం ఆరోగ్యం బాగాలేదని ఇంటికి వచ్చింది. మంగళవారం తిరిగి హాస్టల్ కు వెళితే పేరెంట్స్ ను తీసుకురావాలని టీచర్ చెప్పడంతో తిరిగి బ్రహ్మణపల్లికి వచ్చింది. ఈ క్రమంలోనే తల్లితండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన అఖిల మంగళవారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లితండ్రులు హైదరాబాద్ లోని నవీన హాస్పటల్ కు తీసుకువెళ్ళగా బుధవారం తెల్లవారుజామున మరణించిoది. మృతురాలి తండ్రి లాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM