రైలు కింద పడి ఆత్మహత్య

byసూర్య | Wed, Nov 23, 2022, 10:39 AM

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే హెడాకానిస్టేబుల్ పండరీ తెలిపిన వివరాల ప్రకారం. నార్త్ లాలాగూడ శాంతినగర్కు చెందిన సందీప్ గౌడ్(38) ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంత కాలంగా మద్యానికి బాని సైన సందీప్ గౌడ్ భార్య, పిల్లలను హింసించేవాడు. అతడి బాధలు భరించ లేక అతడి భార్య పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సందీప్ గౌడ్ 22న మంగళవారం లాలాగూడ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 

సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ Thu, Feb 29, 2024, 04:24 PM
నిత్యం ప్రజలకు అందుబాటులో Thu, Feb 29, 2024, 03:32 PM
'ధరణి' బాధితులకు గుడ్‌న్యూస్ Thu, Feb 29, 2024, 03:07 PM
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర Thu, Feb 29, 2024, 03:07 PM
శివాలయం భూమి పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే Thu, Feb 29, 2024, 03:06 PM