![]() |
![]() |
byసూర్య | Wed, Nov 23, 2022, 09:25 AM
మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటిపై వరసగా రెండో రోజూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నేడు ఉదయం నుంచే అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి వరకు సోదాలు చేపట్టి వెళ్లిన అధికారులు, తిరిగి ఉదయాన్నే మళ్లీ ప్రారంభించారు. కాగా, మల్లారెడ్డి కాలేజీల ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి కుటుంబం, ఆయన భాగస్వాముల ఇళ్లల్లో మంగళవారం రాత్రి వరకు సోదాలు చేపట్టారు.