సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంస ఘటనలో.... మరో ఆరుగురి అరెస్ట్

byసూర్య | Wed, Nov 23, 2022, 02:05 AM

గత కొన్ని నెలల కిందట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి కారణమైన కేసులో తాజాగా పోలీసులు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ ఏడాది జూన్ 17న జరిగిన విధ్వంసకాండకు సంబంధించిన కేసులో తాజాగా మరో ఆరుగురు నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌లోకి దూసుకొచ్చిన వందలాదిమంది నిరసనకారులు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా, పదిమంది గాయపడ్డారు. 


ఈ ఘటనపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 81 మందిపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఇప్పటి వరకు పలు దఫాలుగా 66 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా, మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో వికారాబాద్, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలుకు చెందిన వారు ఉన్నారు. కాగా, ఇప్పటికే అరెస్ట్ అయిన వారు బెయిలుపై బయటకొచ్చారు.


 


Latest News
 

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబరు 8 నుంచి పోలీసు ఫిట్ నెస్ పరీక్షలు Sun, Nov 27, 2022, 11:05 AM
భవిష్యత్తులో టీహబ్ స్టార్టప్‌లు మరిన్ని విజయాలు సాధిస్తాయి : సీఎం కేసీఆర్ Sat, Nov 26, 2022, 09:16 PM
గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ Sat, Nov 26, 2022, 08:35 PM
ఫోన్ ఆటోలో మిస్సింగ్..ఖాతా నుంచి రూ.5వేలు హాంఫట్ Sat, Nov 26, 2022, 08:34 PM
భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొంటాం: అమిత్ షా Sat, Nov 26, 2022, 07:17 PM