ప్రజా సమస్యలపై డిప్యూటీ మేయర్ ప్రత్యేక దృష్టి : డిప్యూటీ మేయర్ ధనరాజ్

byసూర్య | Fri, Sep 23, 2022, 01:38 PM

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ 191 ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన 191ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ప్రజా సమస్యలపై డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారిని తన నివాసం వద్దా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను డిప్యూటీ మేయర్ గారి దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే స్పందించి డిప్యూటీ మేయర్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం కాలనీ అభివృద్ధికి తోడ్పడుతున్న డిప్యూటీ మేయర్ గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో 7వ&14వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు మంజునాథ్, బోబ్బా శ్రీను,191ఎన్టీఆర్ నగర్ అధ్యక్షుడు కృష్ణ, కాలనీ వాసులు రాజేష్, పూర్ణ, నర్సింహా, జితేందర్,ఓం ప్రకాష్, రామ్ పరమేష్, పెద్దలు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు


Latest News
 

మురుగు నీటి సమస్యలు రానివ్వొద్దు : కార్పొరేటర్ పవన్ కుమార్ Tue, Feb 18, 2025, 12:38 PM
బీసీల జనాభా ఎందుకు తగ్గిందో సీఎం రేవంత్‌ చెప్పాలి: ఈటల Tue, Feb 18, 2025, 12:27 PM
మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను వేలం వేసిన కోర్టు Tue, Feb 18, 2025, 10:48 AM
జోన్-3 సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల పరిశీలన Tue, Feb 18, 2025, 10:43 AM
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం Tue, Feb 18, 2025, 10:39 AM