హెచ్.సి.ఎ అనాలోచిత నిర్ణయాలకు అభిమానులు బలి

byసూర్య | Fri, Sep 23, 2022, 12:37 PM

ఈ నెల 25 నాడు టి20 సిరీస్ లో భాగంగా 3 వ మ్యాచ్ మన ఉప్పల్ స్టేడియం జరుగనుంది. టికెట్ల విక్రయాలలో హెచ్. సిఎ మొదట పేటీఎం లో ప్రారంభించిన కొద్దీ సమయానికే సోల్డ్ అవుట్ అని క్లోజ్ చేసారు. ఆ సమయానికే కొద్దిమంది బుక్ చేసుకున్న వారికి క్యాన్సల్ల్డ్ అని మెస్సేజులు వచ్చాయి. ఇక జింఖానా గ్రౌండ్స్ దగ్గరికి వెళ్లి టికెట్స్ తీస్కోవాలనుకున్న అభిమానులకు హెచ్. సి. ఎ చుక్కలు చూపించింది. టికెట్స్ అమ్మకపోవడం కాదు కదా వారి ప్రాణాల మీదికి తెచ్చింది.

జింఖానా గ్రౌండ్స్ దగ్గర కనీస ఏర్పాట్లు చేయకుండా టిక్కెట్ల విక్రయాలను ప్రారంభించడo వలన టిక్కెట్ల కోసం అభిమానులు ఎగపడ్డారు. ఈ సందర్బంగా పోలీసులు అభిమానుల పై లాటీ ఛార్జ్ చేయడం వలన తొక్కిసలాట జరింగింది. ఈ తొక్కిసలాటలో చాల మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న జింఖానా సిబ్బంది, హెచ్ సిఎ మీద చర్యలు తీసుకోకుండా అభిమానులపై లాటీ లాఠీచార్జి చేయడం అమానుషం అని ఇప్పటికైనా టిక్కెట్లను విక్రయాలను ప్రారంభించి ఎలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలి అని కోరారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM