రైల్వే స్టేషన్లో బాలిక అదృశ్యంపై కేసు నమోదు

byసూర్య | Fri, Sep 23, 2022, 12:38 PM

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోటకు చెందిన నాలుగు సంవత్సరాల బాలిక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అదృశ్యమైంది. తల్లిదండ్రులు విషయాన్ని చైల్డ్ లైన్ కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైల్డ్ లైన్ తాండూరు నియోజకవర్గ బాధ్యులు నర్సింహులు కథనం ప్రకారం. గ్రామానికి చెందిన తిరుమల్, భార్య లక్ష్మిలు జులై 31న గొడవపడ్డారు. దీంతో భార్య తన కూతురు నర్సమ్మతో కలిసి కూరగాయలు తెస్తామని ఇంట్లోంచి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవ డంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గత నెల 19న వారిద్దరి అదృశ్యం కేసు నమోదు చేశారు. వీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉంటున్నారు. పది రోజుల క్రితం తాను నిద్రిస్తున్న సమయంలో కూతురు కన్పించకుండా పోవడంతో తిరిగి ఇంటికి చేరుకుంది. భర్తకు విషయాన్ని చెప్పడంతో మరోసారి గౌతాపూర్ సమీపంలోని ఠాణాకు చేరుకొని తమ బాలిక అదృశ్యం గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు, చైల్డ్ లైన్ బృందాలు శుక్రవారం సికింద్రాబాద్ వెళ్లి విచారణ జరిపేందుకు నిర్ణయించారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM