పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

byసూర్య | Fri, Sep 23, 2022, 11:10 AM

ఎల్బీనగర్ విభాగ్ దిల్సుక్ నగర్ లో పెండింగ్ లో ఉన్న 3800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల జాప్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అక్యారి మహేష్ మాట్లాడుతూ.. స్కాలర్షిప్పులు ప్రభుత్వాల భిక్ష కాదు విద్యార్థుల హక్కని, విద్యార్థుల సమస్యల సాధన కోసం ఏబీవీపీ ఎంతవరకైనా పోరాడుతుందని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని కారణంగా కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు పొందలేక రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యను దూరం చేసే కుట్రలను ఆపాలని హెచ్చరించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా కో కన్వీనర్ సుమంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిరాం, శంకర్, వెంకటేష్, రాకేష్, ఆనంద్, ఉదయ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM