బతుకమ్మ చీరల పంపిణీ

byసూర్య | Fri, Sep 23, 2022, 10:41 AM

బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు కానుకలు అందజేసి గౌరవించడమే తెలంగాణ సాంప్రదాయం అని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్ పల్లి నియోజక వర్గం పరిధి ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ గంగపుత్ర సంఘంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ (కానుకలు)చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నవీన్కుమార్, కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్, డీసీ రవీందర కుమార్ లు హాజరై మహిళలకు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్వమతాల పండుగలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఈ కార్యక్ర మంలో టీఆర్ఎస్ నాయకులు నరేందర్ గౌడ్, నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఎజాజ్, హరి నాథ్, మాజీ కౌన్సిలర్ మక్కల నర్సింగ్ సునంద, ఉదయ రాణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM