జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోలేదు: పోలీసులు

byసూర్య | Thu, Sep 22, 2022, 01:49 PM

ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ టిక్కెట్ల జారీలో జాప్యం జరగడంతో ఈ ఉదయం క్రికెట్ అభిమానులు క్యూ కట్టారు. హెచ్‌సీఏ తీరుకు నిరసనగా నగరంలోని జింఖానా గ్రౌండ్‌లో నిరసనకు దిగారు.  భారత్-ఆస్ట్రేలియా టీ20 టిక్కెట్ల కోసం క్యూలో నిలబడిన ఓ మహిళ తొక్కిసలాటలో  తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందింది. గేటు దగ్గర తొక్కిసలాటతో ఓ మహిళ స్పృహ కోల్పోయిందని, ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయిందని వార్తలు వచ్చాయి. మహిళను రక్షించేందుకు పోలీసులు సీపీఆర్ చేశారనే వార్త వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలపై స్వయంగా పోలీసులే స్పందించారు. జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందన్న వార్తలను పోలీసులు ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.


Latest News
 

సూసైడ్ స్పాట్ గా కేబుల్ బ్రిడ్జి.. Thu, Sep 29, 2022, 05:36 PM
సీఎం కేసీఆర్ పై మహిళలు ఫైర్ Thu, Sep 29, 2022, 05:32 PM
కేంద్రమంత్రులపై హరీశ్ రావు ఫైర్ Thu, Sep 29, 2022, 05:29 PM
మరో 2 రోజులు భారీ వర్షాలు Thu, Sep 29, 2022, 05:08 PM
కేసీఆర్ రాజ‌కీయంగా వేసే అడుగుల‌న్నీ బీజేపీకి ఉప‌యోగప‌డేలా ఉన్నాయి. Thu, Sep 29, 2022, 04:15 PM