byసూర్య | Thu, Sep 22, 2022, 01:01 PM
తెలంగాణలో గురువారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6:03 లకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6:14 గంటలకు కానుంది.