సబ్సిడీలను ఎత్తివేసేందుకు కేంద్రం యత్నం: మంత్రి జగదీష్ రెడ్డి

byసూర్య | Fri, Aug 19, 2022, 09:14 PM

పేదలకు అందించే సబ్సిడీలను ఎత్తివేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణను చీకట్లోకి నెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని  విమర్శలు గుప్పించారు. మోటర్లకు మీటర్లు పెట్టాలన్నదే ప్రధాని మోదీ పాలసీ అని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో నిరంతరాయంగా విరజిమ్ముతున్న విద్యుత్తు కాంతులను ఆర్పివేసేందుకు.. కేంద్రంలోని మోదీ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోందని ఫైర్ అయ్యారు.


ప్రజలకు మంచి చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం చేసే కుట్రలను తెలంగాణ సమాజం గమనించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ చేసే పనులు తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తే.. ఊరుకోబోమని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజాన్ని, ప్రజలను కేంద్ర బీజేపీ తక్కువ అంచనా వేస్తోందని కామెంట్ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM