అబార్షన్ వికటించి...యువతి మరణం

byసూర్య | Fri, Aug 19, 2022, 09:13 PM

ప్రేమ పేరుతో సాగిన మోసానికి ఓ యువతి బలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పేరుతో యువతిని ట్రాప్ చేసిన యువకుడు ఆమెతో లైంగిక కోర్కెలు తీర్చుకుని గర్భవతిని చేశాడు. చివరికి ఆమెకు అబార్షన్ చేయించే క్రమంలో పరిస్థితి వికటించి ఆమె ఏకంగా ప్రాణాలే కోల్పోయింది.


ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి చెందిన యువతితో పుసుగుడెంకు చెందిన భూక్యా నందు అనే యువకుడికి కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో ఆ యువతి నందుకు దగ్గరైంది. దీన్ని అలుసుగా తీసుకున్న అతడు ఆమెను లైంగికంగా లోబరుచుకున్నాడు. ఈ క్రమంలోనే యువతి గర్భం దాల్చగా అబార్షన్ చేసేందుకు మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్న తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.


అక్కడ డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేస్తున్న సమయంలో ఆమెకు ఫిట్స్ వచ్చి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషయం తెలియగానే నందు, అతడితో వచ్చిన అమ్మాయి అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటికే యువతి మరణించడంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అన్ని విషయాలు ఆరా తీసిన తర్వాత యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అసలు సంగతి తెలిపారు. దీంతో ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు విగతజీవిగా ఉన్న తమ బిడ్డను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ప్రేమ పేరుతో తమ కూతురిని లోబరుచుకుని ప్రాణం తీసిన నందును కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, పరారీలో ఉన్న నందు కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.


Latest News
 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోపాల్ Sun, Sep 24, 2023, 03:01 PM
గ్రామా పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన Sun, Sep 24, 2023, 02:44 PM
జమ్మికుంట బస్టాండ్ లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం Sun, Sep 24, 2023, 01:49 PM
చిన్నాయ్యపల్లిలో గర్భిణీ స్త్రీలకు సీమంతం Sun, Sep 24, 2023, 12:49 PM
వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరికలు Sun, Sep 24, 2023, 12:37 PM