తాడ్వాయిలో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

byసూర్య | Fri, Aug 19, 2022, 09:12 PM

ములుగు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసు అధికార్లు.  ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తాడ్వాయి మండలంలోని వీరాపురం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో.. శుక్రవారం పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా దామెరతోగు సమీపంలోని అడవుల్లో కూంబింగ్‌ నిర్వహించే పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. తప్పించుకునే క్రమంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. అయితే.. ఇరుపక్షాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.


కొన్ని రోజులుగా తాడ్వాయి, ఏటూరునాగారం, వెంకటాపురం, వాజేడు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు పోలీసులు గుర్తించి కూంబింగ్ చేపట్టారు. పోలీసులు అనుమానించినట్టే.. శుక్రవారం మావోయిస్టులు తాడ్వాయి మండలంలో రహస్యంగా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనతో.. ములుగు జిల్లాలో హై అలెర్ట్ నడుస్తోంది. పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానంగా ఉన్న ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.


Latest News
 

మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలి: ఎమ్మెల్యే Thu, Dec 08, 2022, 10:59 AM
కొంపల్లి లో రోడ్డు ప్రమాదం Thu, Dec 08, 2022, 10:57 AM
10 రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు Thu, Dec 08, 2022, 10:53 AM
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు Thu, Dec 08, 2022, 10:50 AM
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం Thu, Dec 08, 2022, 10:49 AM