అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ

byసూర్య | Wed, Aug 17, 2022, 08:18 PM

తిగలాగితే డొంక కదిలినట్లుగా నకిలి సర్టిఫికేట్ల వ్యవహారం వెలుగులోకి వస్తోంది. ఇదిలావుంటే ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికేట్ల కేసులో రాచకొండ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా.. ముద్దం స్వామి అనే వ్యక్తి గురించి కీలక విషయాలు బయటకొచ్చాయి. అమెరికాలో ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. బీటెక్ లో 11 సబ్జెక్టులు ఫెయిల్ అయిన దయాకర్ రెడ్డికి.. ఓయూ ఇంజినీరింగ్ సర్టిఫికేట్లు అందజేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.


ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి రావడంతో.. నాచారం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అమెరికా నుంచి ముద్దం స్వామిని రప్పించేందుకు ఎల్వోసీ జారీ చేశారు. ఇప్పటికే ముద్దం స్వామి పదుల సంఖ్యలో విద్యార్థులకు నకిలీ సర్టిఫికేట్లు పంపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నకిలీ సర్టిఫికేట్లు ద్వారా విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోయారు. ముద్దం స్వామి కూడా.. ఓయూలో హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసినట్లు.. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి 2021లో అమెరికా వెళ్లిపోయాడు.


విదేశాలకు వెళ్లడానికి నకిలీ సర్టిఫికేట్లు కావాల్సిన వారితో.. అమెరికా నుంచి ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ముద్దం స్వామీ మాట్లాడుతాడని పోలీసులు చెబుతున్నారు. ఓలా రైడర్స్ ద్వారా ఇంటి వద్దకే నకిలీ సర్టిఫికేట్లు పంపుతున్నట్లు విచారణ వెల్లడైంది. దీంతో అమెరికా నుంచి ముద్దం స్వామిని రప్పించిన తరువాత.. కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టాలని రాచకొండ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM